HomeNewsఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టిస్తే భయపడతారా..? 

ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టిస్తే భయపడతారా..? 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • అప్పుడేం చేశారో మర్చిపోయారా?
  • నిలబడని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు 
  • ఖబర్దార్.. పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠమే
  • 19వ వార్డ్ కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న ‘అక్రమ కేసుల డ్రామా’పై కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖంగా బీఆర్ఎస్ నాయకుల వైఖరిని ఎండగట్టారు.మున్సిపల్ కౌంటింగ్ రోజున నియోజకవర్గ సాక్షిగా బీఆర్ఎస్ నాయకులు చేసిన అరాచకాలు అందరికీ గుర్తున్నాయన్నారు. సాక్ష్యాధారాలతో సహా వారిపై నాన్-బేయిలబుల్ కేసులు నమోదైన విషయం వాస్తవం కాదా?” అని వెంకట్ సూటిగా ప్రశ్నించారు. ఆనాడు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, నేడు ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బురద చల్లాలని చూడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యేపై నమోదు చేయించిన ఎఫ్ఐఆర్ కేవలం అపకీర్తిని తెచ్చేందుకు చేసిన కుట్ర మాత్రమేనని, ఇలాంటి నిరాధార కేసులు కోర్టుల ముందు వీగిపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేను ఎదుర్కోలేకనే ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తూ తాండూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని వెంకట్ హెచ్చరించారు. మళ్లీ మళ్లీ రాద్దాంతం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వీడ్కోలు పలికే రోజులు దగ్గరపడ్డాయి అని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments