HomeNewsమత్తులో మాట్లాడుతున్నారు జాగ్రత్త...! 

మత్తులో మాట్లాడుతున్నారు జాగ్రత్త…! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • డ్రగ్స్ మత్తులో అధికారులపై దాడి చేశారు 
  • ఓటమి భయం తో కుట్రలు చేశారు 
  • ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకు కొత్త డ్రామాలు 
  • 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : బిఆర్ఎస్ నాయకులు మత్తులో ఎం మాట్లాడుతున్నారో వారికీ అర్ధం అవ్వడం లేదని బంటు వేణు ఆరోపించారు. గత మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర మత్తులో ఉండి పోలీస్ అధికారులపై దాడి చేసిన సంఘటన తాండూరు ప్రజలకు తెలుసన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మచ్చ లేని నాయకుడని, అయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు అన్నారు. శనివారం బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేసిన కేసు కుట్రపురితమైనదే అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే మనోహర్ రెడ్డి పై ప్రైవేట్ కేసులు నమోదు చేయించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నరన్నారు. గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ చెయ్యని అభివృద్ధి ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 2ఏళ్ల లోనే చేసి చూపిస్తున్నారని అన్నారు. తాండూరు అభివృద్ధి చెందితే ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులను తరిమికొడుతారానే భయం తో లేని పోనీ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మచ్చ లేని నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేస్తే సాహించేది లేదన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments