HomeNewsఇళ్ల కేటాయింపుపై అసత్య ప్రచారాలు వద్దు..!

ఇళ్ల కేటాయింపుపై అసత్య ప్రచారాలు వద్దు..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • బీఆర్ఎస్, బీజేపీ నేతలపై జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కే. గోపాల్ ధ్వజం
  • జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కే. గోపాల్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరులో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కే. గోపాల్ మండిపడ్డారు.శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో అర్హులైన పేదలందరికీ న్యాయం జరుగుతోందన్నారు. సుమారు 1,000 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, పారదర్శకంగా కొనసాగుతోందని వివరించారు. “అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారానే ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని, కానీ, 200 ఇళ్లు ఒకే వర్గానికి ఇచ్చారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధం” అని ఆయన స్పష్టం చేశారు.నియోజకవర్గంలో 1,000 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు, మరో 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలు ఇలాంటి కుట్రపూరిత మాటలను నమ్మవద్దని గోపాల్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments