HomeNewsమంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన..! 

మంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన..! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

– తాండూరుకు రానున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు.

– పామ్ ఆయిల్ తోటను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు

– కార్యక్రమం విజయవంతం చేసేలా అధికారులకు, కార్యకర్తలకు కీలక సూచనలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 4వ తేదీన తాండూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముఖ్యంగా మంత్రులు సందర్శించబోయే పామ్ ఆయిల్ తోటను సందర్శించి, అక్కడ సభకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మంత్రుల పర్యటన ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగుపై మరింత అవగాహన, ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, రవి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్రెడ్డి, యువ నాయకులు ఎబినైజర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రుల రాక నేపథ్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments