HomeNewsనిర్ణయం బాగుంది.. బకాయిలు కూడా తీర్చండి..!

నిర్ణయం బాగుంది.. బకాయిలు కూడా తీర్చండి..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

విద్యార్థులకు, యాజమాన్యాలకు రెండింటికీ మేలు

–  పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలి

 – బిసి జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల బిసి జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త విధానం ద్వారా విద్యార్థులకు నేరుగా లబ్ధి చేరడమే కాకుండా, కాలేజీ యాజమాన్యాలకు కూడా సకాలంలో ఫీజులు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో ఉన్న మధ్యవర్తిత్వం, నిధుల విడుదల లో జాప్యం వంటి సమస్యలు ఈ పద్ధతి వల్ల గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫీజులను స్వయంగా చెల్లించడం వల్ల వారిలో బాధ్యత పెరుగుతుందని, కాలేజీలకు ఆర్థిక ప్రవాహం సక్రమంగా జరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ నిర్ణయం పారదర్శకతకు నిదర్శనమని పేర్కొంటూనే, ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పాత ఫీజు బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని రాజ్‌కుమార్ కోరారు. బకాయిలు క్లియర్ చేస్తే విద్యా సంస్థలు ఆర్థికంగా బలోపేతమై, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించగలవని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments