HomeNewsకాబోయే సీఎం కేసీఆర్...!

కాబోయే సీఎం కేసీఆర్…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే.. 
  • తాండూరులో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
  • మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో మళ్లీ భారత్ రాష్ట్ర సమితి ప్రభంజనం మొదలవుతుందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. పార్టీ శ్రేణులు గులాబీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేకపోతోందని మండిపడ్డారు. ఎన్నికల వేళ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలను నట్టేట ముంచిందని.. ఈ మోసాన్ని గమనిస్తున్న ప్రజలు రాబోయే రోజుల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయిపూర్ నర్సింలుతో పాటు కౌన్సిలర్లు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు,ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments