HomeNewsవికాస్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే...!

వికాస్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • యువ నాయకుడు వికాస్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
  • ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. కుటుంబ సభ్యులకు భరోసా

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువ నాయకుడు వికాస్‌ను తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్ళిన ఎమ్మెల్యే, వికాస్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్సకు సంబంధించిన వివరాలను సేకరించారు. వికాస్‌కు మెరుగైన వైద్యం అందించాలని, త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే, బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వికాస్ ఆరోగ్య విషయమై ఎటువంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మరియు పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments