HomeNewsనమ్మకాన్ని నిలబెట్టుకుంటా...!

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా సాహు శ్రీలత
  • రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీలత
  • హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా తాండూరుకు చెందిన సాహు శ్రీలత నియమితులయ్యారు. తనపై నమ్మకముంచి ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శనివారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. తనకు ఈ అవకాశం కల్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు,రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డిలకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఆశయాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో మహిళలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.సాహు శ్రీలత నియామకం పట్ల తాండూరు ప్రాంత బిజెపి నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో కీలక పదవి దక్కడం పట్ల పలువురు ముఖ్య నాయకులు ఆమెను అభినందనలతో ముంచెత్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments