HomeNewsతంబాకు' ప్యానెల్ ఫుల్ జోష్...!

తంబాకు’ ప్యానెల్ ఫుల్ జోష్…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ప్రచారంలో తంబాకు చంద్రశేఖర్ ప్యానెల్ జోరు
  • 15 మంది సభ్యులతో తొలి పూర్తిస్థాయి ప్యానెల్‌గా ప్రకటన
  • క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న అభ్యర్థులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రతిష్టాత్మక ‘వీరశైవ సమాజం’ 2026-2028 కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. ఈ ఎన్నికల బరిలో తంబాకు చంద్రశేఖర్ ప్యానెల్ వ్యూహాత్మక ప్రచారంతో ఇతర వర్గాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది.ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే, మొట్టమొదటిసారిగా 15 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి కార్యవర్గ బృందాన్ని ప్రకటించి, క్షేత్రస్థాయిలోకి వెళ్లిన ఏకైక ప్యానెల్‌గా తంబాకు చంద్రశేఖర్ వర్గం ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్యానెల్ సభ్యులందరూ కలిసికట్టుగా సమాజ సభ్యుల ఇళ్లకు వెళ్తూ మద్దతు కోరుతున్నారు. గతంలో వీరశైవ సమాజం ద్వారా చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధిలో తమకున్న చురుకైన పాత్రను వివరిస్తూ తంబాకు చంద్రశేఖర్ బృందం ముందుకు సాగుతోంది. ప్యానెల్‌లోని సభ్యుల మధ్య ఉన్న పరస్పర సహకారం, సమిష్టి నిర్ణయాలు ఈ జట్టుకు ప్రధాన బలంగా మారాయని సమాజ సభ్యులు చర్చించుకుంటున్నారు.తాండూరు పట్టణంతో పాటు సమాజ సభ్యులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ ప్యానెల్ విస్తృతంగా పర్యటిస్తోంది. సమాజ భవిష్యత్తు కోసం తాము చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు అనుభవం, మరోవైపు యువ రక్తం కలగలిసిన ఈ ప్యానెల్ వైపు సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయి టీమ్‌తో బరిలోకి దిగిన తంబాకు చంద్రశేఖర్ ప్యానెల్ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు తాండూరులో హాట్ టాపిక్‌గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments