HomeNewsరోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత...! 

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత…! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  •  తాండూరు పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ‘అర్రైవ్ అలైవ్’ కార్యక్రమం
  •  పాల్గొన్న కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజల భద్రతే మా బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని 24వ వార్డు కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాండూరు పోలీస్ విభాగం చేపట్టిన ‘అర్రైవ్ అలైవ్’ ప్రోగ్రాంలో భాగంగా రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ బాలకృష్ణారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్ ధరించడం, పరిమితి వేగంతో ప్రయాణించడం వంటి ప్రాథమిక సూత్రాలను పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. సమాజంలో భద్రతపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్పీలు, వార్డు సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి, ప్రచార పత్రాలను పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments