HomeNewsకష్టసుఖాలను సమానంగా స్వీకరించడమే ఉగాది..!

కష్టసుఖాలను సమానంగా స్వీకరించడమే ఉగాది..!

  • లోకకల్యాణార్థం బ్రహ్మోత్సవాలు…ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి
  • బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
  • భద్రేశ్వరాలయంలో పంచాంగ శ్రవణం – ఎమ్మెల్యే హాజరు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఆరాధ్యదైవం శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం ఉగాది వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆయన కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో మార్పు తెచ్చే వసంత రుతువు, ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని నేర్పుతుందని, ఈ ఏడూ చెడు అంతమై మంచితనం వెల్లివిరియాలని కోరుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రతి ఇంటా సౌభాగ్యం నిండాలని ఆయన ప్రార్థించారు. ఉగాది పర్వదినం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోల్ల నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల్ల నర్సింలు, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మేడి మహేష్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments