HomeEntertainment'లెనిన్' సక్సెస్ క్రెడిట్ చిన్న కోడలికి ఇచ్చిన నాగార్జున.!

'లెనిన్' సక్సెస్ క్రెడిట్ చిన్న కోడలికి ఇచ్చిన నాగార్జున.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO


‘లెనిన్’ సక్సెస్ క్రెడిట్ చిన్న కోడలికి ఇచ్చిన నాగార్జున.!

Jul 11, 2026 3:23PM

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన భారీ సక్సెస్ అక్కినేని క్యాంప్‌లో సరికొత్త జోష్ నింపింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను తన చిన్న కోడలికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది.

అఖిల్ గతేడాది జైనాబ్ రావ్‌డ్జీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి తర్వాత అఖిల్ నుంచి వచ్చిన మొదటి లెనిన్ కావడం విశేషం. కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి.. లెనిన్ తో అది నెరవేరింది. ఆ ఆనందంలోనే తన కొడుకు లెనిన్ సక్సెస్ క్రెడిట్ ని కోడలికి ఇచ్చేశాడు నాగార్జున. 

“అఖిల్ కి పెద్ద సర్జరీ అయ్యింది. ఆ తర్వాత మనిషి కామ్ అయిపోయాడు. కామ్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే టైంలో తనకి ఒక తోడు వచ్చింది. అప్పటి నుంచి గుడ్ టైం స్టార్ట్ అయింది. బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదే కంటిన్యూ చేస్తే, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తాడు.” అని నాగార్జున మాట్లాడాడు.

అఖిల్ లైఫ్ లోకి ఒక తోడు వచ్చాక, గుడ్ టైం స్టార్ట్ అయిందని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. “లెనిన్ సక్సెస్ క్రెడిట్ చిన్న కోడలికి ఇచ్చిన నాగార్జున” అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Akhil Akkineni, Lenin Movie, Nagarjuna, TeluguOne

 





Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments