HomeNewsకోట మురళీకృష్ణ ప్యానల్‌కు ‘పెద్దల’ అభయం

కోట మురళీకృష్ణ ప్యానల్‌కు ‘పెద్దల’ అభయం

  • కోట మురళీకృష్ణ ప్యానల్‌కు ఆర్యవైశ్య సంఘ పెద్దల బాసట
  •  అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సభ్యుల ఐక్యతే మా నినాదం తో ముందుకు..
  • సంఘం అంటే అందరిది సంఘం అంటే కొందరిది కాదు అనే లక్ష్యంతో..
  •  అఖండ మెజార్టీతో గెలిపించాలని సంఘ పెద్దల పిలుపు

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఉపందుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోట మురళీకృష్ణ ప్యానల్‌కు సంఘం లోని అన్ని వర్గాల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. సంఘం మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ పెద్దలు మరియు అనుబంధ విభాగాల ప్రతినిధులు కోట మురళీకృష్ణ నాయకత్వానికి తమ పూర్తిస్థాయి మద్దతును ప్రకటించారు.మురళీకృష్ణ ప్యానల్ గెలుపు కోసం మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు, వర్తక వాణిజ్య వ్యాపార ప్రముఖులు మరియు నగరేశ్వర దేవస్థాన కమిటీ సభ్యులు ఏకతాటిపైకి వచ్చారు. సంఘం అభివృద్ధి పథంలో సాగాలన్నా, సభ్యుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలన్నా అనుభవజ్ఞులైన నాయకత్వం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ, కోట మురళీకృష్ణ కేవలం ఒక నాయకుడిలా కాకుండా, నిరంతరం సంఘ సేవలో ఉండే ఒక కార్యకర్తలా పనిచేస్తారని కొనియాడారు. సంఘం గెలుపు – సభ్యుల సంక్షేమం అనే నినాదంతో, అందరినీ కలుపుకుని పోతూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా మనమంతా ఒక్కటే అనే భావనతో ముందుకు నడిపించే సత్తా ఈ ప్యానల్‌కు ఉందని వారు స్పష్టం చేశారు.సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పించి, సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మురళీకృష్ణ ప్యానల్ కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. సంఘ గౌరవాన్ని పెంపొందించేందుకు, సంక్షేమ పథకాలను ప్రతి సభ్యునికి చేరవేసేందుకు కృషి చేస్తున్న ఈ ప్యానల్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments