HomeNewsప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం..!

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో ఇంటర్ పరీక్షలు ప్రారంభం…! 
  • తొలిరోజు 2,496 మంది హాజరు

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని 7 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,553 మంది విద్యార్థులకు గాను, 2,496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 57 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిర్ణయించిన సమయానికి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతల దృష్ట్యా సెక్షన్ 144 అమల్లో ఉంచారు. జనరల్ విభాగంలో 1,969 మందికి గాను 1,936 మంది, వొకేషనల్ విభాగంలో 584 మందికి గాను 560 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అధికారులు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ పరీక్షలను పర్యవేక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments