HomeNewsసందడిగా సంధిల్ నిర్వన్ బర్త్‌డే...!

సందడిగా సంధిల్ నిర్వన్ బర్త్‌డే…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • చిన్నారుల నవ్వుల మధ్య ‘సంధిల్ నిర్వన్’ పుట్టినరోజు…! 
  • అంగన్‌వాడీలో అన్నదానంతో చాటుకున్న మానవత్వం!

జనవాహిని ప్రతినిధి, తాండూరు: ఆడంబరాల కంటే ఆకలి తీర్చడమే మిన్న అని చాటిచెప్పారు తాండూరుకు చెందిన ఓ కుటుంబం. చిన్నారుల కేరింతలు, పసిమొగ్గల ఆశీస్సుల నడుమ సంధిల్ నిర్వన్ గౌడ్ 5వ జన్మదిన వేడుకలు మాల్రెడ్డిపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రంలో అత్యంత వైభవంగా, అర్థవంతంగా జరిగాయి.అమ్మప్రేమ.. నాన్న ఆశయం.. చిన్నారుల ఆకలి తీర్చడం…నేటి ఆధునిక కాలంలో ఖరీదైన హోటళ్లు, కేక్‌లకే పరిమితం కాకుండా, తమ కుమారుడు సంధిల్ నిర్వన్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని తల్లిదండ్రులు శ్రీయ – నరేందర్ గౌడ్ వినూత్నంగా ఆలోచించారు. మాల్రెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారుల మధ్యకు వెళ్లి, వారితో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేయించారు. అనంతరం అక్కడి చిన్నారులందరికీ కడుపునిండా అన్నదానం చేసి, వారి ముఖాల్లో సంతోషాన్ని చూసి మురిసిపోయారు.చిన్నారుడు..సంధిల్ నిర్వన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ అంగన్‌వాడీ సిబ్బంది మరియు చిన్నారులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దనాన్న, పెద్దమ్మలు మహేందరనాథ్ గౌడ్ – పావని, తాత, నాయనమ్మలు ప్రభాకర్ గౌడ్ – నిర్మల తమ మనవడిని దీవిస్తూ, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.చిన్న వయసులోనే బాబుకు సేవా భావాన్ని అలవాటు చేస్తున్న తల్లిదండ్రుల సంస్కారాన్ని చూసి స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసల వర్షం కురిపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments