HomeNewsప్రజల మనిషి...ప్రగతికి బాట..!

ప్రజల మనిషి…ప్రగతికి బాట..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ప్రజల మనిషి.. ప్రగతికి బాట..! 
  • 15వ వార్డు కౌన్సిలర్ విజయోత్సవం
  • అంబేద్కర్ కు ఘన నివాళులు 
  • వార్డ్ ప్రజలతో మాట ముచ్చట….

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఎల్లప్ప తన విజయాన్ని వార్డు ప్రజలకు అంకితం చేశారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయం లో కౌన్సిలర్ గా ప్రమాణస్వీకారం చేసి అనంతరం నేరుగా ప్రజల మధ్యకు వెళ్లిన ఆయన, అంబేద్కర్ పార్కులో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ముందుగా వార్డులోని అంబేద్కర్ పార్కుకు చేరుకున్న కౌన్సిలర్ ఎల్లప్ప, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అనంతరం వార్డు ప్రజలతో ఎల్లప్ప మమేకమయ్యారు. గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధిలో రాజకీయాలకు తావులేకుండా, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని భరోసా ఇచ్చారు.ఈ విజయోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లప్ప, రవి, నరేష్, సుభాష్ తో పాటు యువతలో మంచి పట్టున్న నాయకులు తేజ, కేతేశ్వర్, నరేందర్, నవీన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. యువత, మహిళలు, పెద్దలు సంఖ్యలో తరలివచ్చి కౌన్సిలర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments