HomeNewsచైతన్య కళాశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ 

చైతన్య కళాశాలలో ఘనంగా వీడ్కోలు పార్టీ 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • క్రీడలు మరియు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు
  •  ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
  • విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
  •  నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆర్థిక సాయం 
  •  కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి 

జనవాహిని ప్రతినిధి తాండూరు :    ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటు… వీడుకోలంటు వెళ్లిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో.. వి మిస్‌ ఆల్‌ ద ఫన్‌.. వి మిస్‌ ఆల్‌ ద జాయ్‌.. వి మిస్‌ యూ.. అంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు వీడ్కోలు చెప్పుకున్నారు. ఇంతకాలం కలిసి చదువుకున్న స్నేహితులను వదిలి వెళ్లాల్సి రావడంతో గుండె లోతుల్లో నుంచి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ కన్నీటితో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. పరీక్షలు అంటే భయపడకుండా ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎల్లప్పుడూ తాము వెన్నంటూ ఉంటామని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో మరియు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జగ్జీవన్ రెడ్డి, యాజమాన్య బృందం నిర్మల మధుసూదన్ రెడ్డి, రాము, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments