HomeNewsమున్సిపల్ పీఠం గులాబీదే..!

మున్సిపల్ పీఠం గులాబీదే..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
  • పైలెట్ రోహిత్ రెడ్డి
  • పట్టణంలో ఎగిరేది గులాబీ జెండానే.. 28 సీట్లు గెలవబోతున్నాం
  • కాంగ్రెస్ మోసాలకు ఓటుతోనే ప్రజల బుద్ధి.. మాజీ ఎమ్మెల్యే ధీమా

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పీఠం మరోసారి బీఆర్ఎస్ పార్టీదేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తాండూరు పట్టణ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ఆయన స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి, ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్న తాండూరు పట్టణ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని, గత పాలనలో జరిగిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా 28 సీట్లను కైవసం చేసుకోబోతుందని ఆయన జోస్యం చెప్పారు. తాండూరు గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments