HomeNewsఆ ఇద్దరు పెద్ద దొంగలు...!

ఆ ఇద్దరు పెద్ద దొంగలు…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు టీఆర్ఎస్ అభ్యర్థులపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు
  • పట్లోళ్ల నర్సింహులు, డాక్టర్ సంపత్‌లే టార్గెట్
  • ​సాయిపూర్‌లో భూకబ్జాల పర్వం.. సాక్ష్యాలున్నాయంటూ వెల్లడి
  • ​‘నా ప్రాణాలకు ముప్పు.. చంపేందుకు సుపారీ ఇచ్చారు.

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్య మలుపు తిరిగాయి. అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ అభ్యర్థుల తీరుపై యలాల్ మండలం బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులు, డాక్టర్ సంపత్‌లు సామాన్యుల భూములను కబ్జా చేస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా ఆరోపించి సంచలనం సృష్టించారు.భూ కబ్జాల చిట్టా విప్పిన ‘మిత్రూ ’ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిత్రూ నాయక్ మాట్లాడుతూ అధికార బలంతో జరుగుతున్న అక్రమాలను ఏకరువు పెట్టారు.​సాయిపూర్ లోని సర్వే నెం. 52లో అజ్మీర్ దర్గా, అంబేద్కర్ భవనం పక్కనే ఉన్న రెండు ఎకరాల విలువైన భూమిని నర్సింలు, సంపత్ కబ్జా చేశారని ఆరోపించారు.బషీర్ మియా తాండాకు చెందిన జైయుద్దీన్ అనే వ్యక్తిని బెదిరించి 500 గజాల స్థలాన్ని లాక్కుని, అందులో మూడు కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు.1988లో ప్రభుత్వం కిష్టప్ప, నాగప్ప, బాలప్ప వంటి వారికి కేటాయించిన అసైన్మెంట్ భూములను కూడా వదలకుండా ఫెన్సింగ్ వేశారని మండిపడ్డారు.నర్సింహులు రౌడీ షీటర్ల కంటే ప్రమాదకరం, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు, నలుగురు పోటీ చేయడం ప్రజా సేవ కోసం కాదు, కేవలం పదవీ వ్యామోహం, పైసల మీద ఆశేనని ఆరోపించారు. అతను గెలిస్తే తాండూరులో ఏ ఖాళీ స్థలం మిగలదు అని మిత్రూ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సైతం నర్సింహులు వెన్నుపోటు పొడిచి దారి మళ్లించారని ఆరోపించారు.తాను నిజాలు మాట్లాడుతున్నందున తనపై పగ పెంచుకున్నారని, తానను చంపడానికి రూ. 40 నుంచి 50 లక్షల సుపారీ ఇచ్చి ప్లాన్ చేస్తున్నారని మిత్రూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఏమైనా జరిగితే వీరే బాధ్యులు అని వెల్లడించారు. భూకబ్జాలకు సంబంధించిన 1984 నాటి ఉర్దూ పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. త్వరలోనే వాటిని ప్రజల ముందు పెడతాను అని స్పష్టం చేశారు.అరాచక శక్తులను అడ్డుకోవాలంటే 9, 10 వార్డుల ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి నర్సింహులు లాంటి వారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments