Home News కారేక్కిన యువత..!

కారేక్కిన యువత..!

327
0
  • గులాబీ గూటికి యువత!
  • పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు
  • అభివృద్ధికి ఆకర్షితులయ్యే బీఆర్ఎస్‌లో చేరుతున్నామన్న యువత

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి యువత బాయ్ బాయ్ చెప్పారు. పట్టణ యువత పెద్ద ఎత్తున ‘చేయి’ని వీడి ‘కారు’ వైపు అడుగులు వేస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన యువకులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శ్రీహరి తన మిత్రబృందంతో కలిసి, అలాగే 6వ వార్డుకు చెందిన మహేష్ పలువురు యువకులతో కలిసి పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ఉత్సాహంగా చేయికి బాయి బాయి.. కారుకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి పైలెట్ రోహిత్ రెడ్డి పడ్డ శ్రమను చూసి తాము పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యక్షేత్రంలో పని చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here