HomeEntertainmentToxic Movie: బోల్డ్ సీన్లతో కియారా షాక్.. ‘టాక్సిక్’లో అసలు సీన్ ఇదే!

Toxic Movie: బోల్డ్ సీన్లతో కియారా షాక్.. ‘టాక్సిక్’లో అసలు సీన్ ఇదే!

Toxic Movie: రాకింగ్ స్టార్ యష్, బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విధ్వంసం సృష్టిస్తోంది. కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం యష్ నటించిన సినిమా కావడంతో తొలిరోజే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. అయితే మూవీ విడుదలైన నిమిషాల్లోనే సోషల్ మీడియాలో స్పాయిలర్లు.. ముఖ్యంగా యష్, కియారా అద్వానీ మధ్య చిత్రీకరించిన కొన్ని రొమాంటిక్ సీన్లు లీక్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వైరల్‌గా మారిన కారు రొమాన్స్ సీన్
ఈ సినిమా టీజర్ తోనే ఆకట్టుకున్న ఈ జంట.. వెండితెరపై తమ బోల్డ్ అండ్ హాట్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా వారిద్దరి మధ్య వచ్చిన కారు రొమాన్స్ సన్నివేశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కియారా అద్వానీ బోల్డ్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతుండగా.. మరికొందరు మాత్రం ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ కు దిగారు. పెళ్లి అయి.. నిత్యం వార్తల్లో నిలిచే నటి ఇలాంటి సీన్లలో నటించడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేయగా.. నటనను నటనగా మాత్రమే చూడాలని అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

ట్రోలింగ్‌ను దాటి మెప్పించిన కియారా యాక్టింగ్
సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌ను హీరోయిన్ కియారా అద్వానీ ఏ మాత్రం పట్టించుకోకుండా.. పాత్ర డిమాండ్ మేరకు నటించడం తన వృత్తిలో భాగమని స్పష్టం చేసింది. సినిమా చూసిన అభిమానులు కూడా కియారాను కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితం చేయకుండా.. ఆమె పోషించిన పాత్రలోని తీవ్రతను, శక్తివంతమైన నటనను కొనియాడుతున్నారు. ఈ చిత్రంలో రొమాన్స్ తో పాచు ఆమె యాక్టింగ్ స్టోరీకి ప్రధాన బలమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Kiara is gonna break the Internet Again 🥵🥵🔥🔥🤤🤤#KiaraAdvani #Toxic #Yash pic.twitter.com/dDIbFuPDjI

బాక్సాఫీస్ సునామీ
మహిళా డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో యష్‌తో పాటు నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. వారం మధ్యలోనే విడుదలైనప్పటికీ.. వ్యాపార విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా ఇండియాలో మొదటిరోజే రూ.80-100 కోట్ల మధ్య భారీ వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతోంది. యష్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

Kiara Advani in Toxic the Movie 🤯#ToxicTheMovie #KiaraAdvani #ToxicReview pic.twitter.com/S1dxtwvgO2

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments