- ఎమ్మెల్యే చొరవతో తగ్గిన భూముల మార్కెట్ విలువలు
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన డాక్యుమెంట్ రైటర్లు
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పురపాలక పరిధిలోని పలు రెవెన్యూ వార్డుల్లో భూముల మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువల భారం ఎట్టకేలకు తగ్గడం తో డాక్యుమెంట్ రైటర్స్ లు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం పెంచిన ధరల వల్ల సామాన్య ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తక్షణమే స్పందించి, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ధరలు తగ్గించేలా ప్రత్యేక చొరవ చూపారు.
ఎమ్మెల్యే కృషి ఫలితంగా పట్టణంలోని మాలరెడ్డిపల్లి, సీసీఐ కాలనీ, సాయిపూర్, గొల్లాచెరువు, మాణిక్ నగర్ వంటి ప్రాంతాల్లో సవరించిన భూముల ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు తీవ్ర ఊరట లభించింది.
ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినందుకు గాను, బుధవారం డాక్యుమెంట్ రైటర్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భూముల ధరల తగ్గింపునకు చొరవ చూపినందుకు ఆయనకు శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
