HomeTelanaganahyderabadఘనంగా మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు..!

ఘనంగా మిలాద్‌ ఉన్ నబీ వేడుకలు..!

పాల్గొన్న సంతోష్ గౌడ్, సంజీవ్ రావ్
– మతసామరస్యానికి తాండూరు ప్రతీక

జనవాహిని ప్రతినిధి తాండూరు; పాత తాండూరులో మిలాద్‌ ఉన్ నబీ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత తాండూరు వీధుల్లో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్, సంజీవ్ రావ్ ముఖ్య అతిథులుగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాలుపంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాత తాండూరులో కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను ఐక్యతతో, సోదరభావంతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని కొనియాడారు.
భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో మతసామరస్యం కొనసాగాలని ఆకాంక్షించారు. తమను ఈ పవిత్ర కార్యక్రమానికి ఆహ్వానించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణ ప్రజలందరికీ మిలాద్‌ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, నాయకులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments