- తాండూరు ప్రశాంతతను చెడగొడితే సహించేది లేదు
- కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు వికాస్ జోషి
తాండూరు జనవాహిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో న్యూసెన్స్ ర్యాలీలు, నాన్సెన్స్ మాటలు వెంటనే బంద్ చేయాలని, ప్రాంతీయ ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు వికాస్ జోషి హెచ్చరించారు. బుయ్యని మనోహర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి లపై హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో మాట్లాడితే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని, ఆ పరిధి దాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇతరులపై నిందలు వేసే ముందు విమర్శకులు తమ రాజకీయ అద్దంలో తమ ముఖాలను చూసుకోవాలన్నారు.
బుయ్యని సోదరులు స్వచ్ఛమైన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, తమ సొంత కష్టంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రజా సేవలోకి వచ్చారని తెలిపారు. కొందరిలా డ్రగ్స్ దందాలు, భూకబ్జాలు లేదా అక్రమ వ్యవహారాల ద్వారా ఎదిగిన వారు కారని పేర్కొన్నారు. ర్యాలీల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించే రాజకీయాలను తాండూరు ప్రజలు గమనిస్తున్నారని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.
ఆయా షేర్ ఆయా షేర్ అంటూ ప్రజలు ఇచ్చిన తీర్పే, ఎవరి బలమేంటో, ప్రజల నమ్మకం ఎటువైపు ఉందో స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. బుయ్యని సోదరులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.