HomeJobsNew Medical Courses: వైద్య విద్యార్థులకు 11 కొత్త స్పెషాలిటీ కోర్సులు

New Medical Courses: వైద్య విద్యార్థులకు 11 కొత్త స్పెషాలిటీ కోర్సులు

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY

New Medical Courses: వైద్య విద్యార్థులకు 11 కొత్త స్పెషాలిటీ కోర్సులు

భారతదేశంలో వైద్య విద్య నాణ్యతను మరింత పెంచేందుకు, ఆసుపత్రుల పనితీరులో పారదర్శకతను పెంచేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మెడికల్ అక్రిడిటేషన్ , అడ్మిషన్ల ప్రక్రియలో ఊహించని మార్పులు తీసుకొస్తూ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికితోడు వైద్య రంగంలో నిపుణుల కొరతను తీర్చడమే ధ్యేయంగా పీజీ, ఫెలోషిప్ విభాగాల్లో ఏకంగా 11 కొత్త స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించింది. ఈ నూతన సంస్కరణలు దేశంలో వైద్య విద్య ప్రమాణాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తాయని నిపుణులు భావిస్తున్నారు.

గుర్తింపు పొందిన ఆసుపత్రులు, వైద్య సంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్‌లలో ‘ఎన్‌బీఈఎమ్‌ఎస్ ఆవశ్యక సమాచారం’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఆసుపత్రిలోని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వివరాలు, రోగుల రద్దీ, బెడ్ల లభ్యత , విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకొకసారి ఈ సమాచారాన్ని సమీక్షించి అప్‌డేట్ చేయాలి. అసత్య సమాచారం ఇచ్చినా, నిబంధనలు పాటించకపోయినా ఆయా ఆసుపత్రుల అక్రిడిటేషన్‌ను రద్దు చేయడమే కాకుండా కౌన్సెలింగ్ సీట్లలో కోత విధిస్తామని ఎన్‌బీఈఎమ్‌ఎస్ హెచ్చరించింది.

Medical Exam Board NBEMS Announces 11 New PG Courses And Imposes Fine For Faulty Student Admissions

బోగస్ అడ్మిషన్లకు చెక్.. లక్ష రూపాయిల జరిమానా!

అర్హతలు సరిగ్గా పరిశీలించకుండా, నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్లు ఇచ్చే ఆసుపత్రులపై బోర్డు ఉక్కుపాదం మోపనుంది. విద్యార్థులు అడ్మిషన్ పొందే సమయంలో వారి అసలు దస్తావేజులు (ఒరిజినల్ డాక్యుమెంట్లు), అర్హతలను ఆసుపత్రులు అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఆసుపత్రయినా నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు సర్టిఫికెట్లతో ప్రవేశాలు కల్పిస్తే, సదరు ఆసుపత్రికి ఒక్కో అభ్యర్థిపై రూ. 1 లక్ష చొప్పున భారీ జరిమానా విధిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో నిర్దేశిత గడువులోగా నమోదు పూర్తి చేయాలని ఆదేశించింది.

వైద్య విద్యార్థులకు పండుగే.. వారికి ఏడాదికి రూ.1,50000 స్కాలర్ షిప్!
వైద్య విద్యార్థులకు పండుగే.. వారికి ఏడాదికి రూ.1,50000 స్కాలర్ షిప్!

వైద్య విద్యార్థులకు పండుగ.. 11 కొత్త స్పెషాలిటీ కోర్సులు!

వైద్యరంగంలో వస్తున్న నూతన పురోగతికి అనుగుణంగా 11 అధునాతన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

  • డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ (Diploma in Nuclear Medicine)
  • డీఎన్‌బీ ట్రోమా అండ్ అక్యూట్ కేర్ సర్జరీ (DNB Trauma and Acute Care Surgery)
  • డాక్టర్ ఎన్‌బీ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ (DrNB Paediatric Hemato Oncology)
  • డాక్టర్ ఎన్‌బీ పల్మనరీ మెడిసిన్ (DrNB Pulmonary Medicine)
  • డాక్టర్ ఎన్‌బీ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ (DrNB Head & Neck Oncology)
  • ఎఫ్ఎన్‌బీ పీడియాట్రిక్ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ (FNB Paediatric Rheumatology and Clinical Immunology)
  • ఎఫ్ఎన్‌బీ అప్పర్ జీఐ సర్జరీ (FNB Upper GI Surgery)
  • ఎఫ్ఎన్‌బీ హెపటో పాంక్రియాటో బిలియరీ సర్జరీ (FNB Hepato Pancreato Biliary Surgery)
  • ఎఫ్ఎన్‌బీ ఆస్తమా, అలర్జీ అండ్ అప్లైడ్ ఇమ్యూనాలజీ (FNB Asthma, Allergy and Applied Immunology)
  • ఎఫ్ఎన్‌బీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ (FNB Interventional Pulmonology)
  • ఎఫ్ఎన్‌బీ బ్రెస్ట్ సర్జరీ (FNB Breast Surgery)
MBBS Seats: మన దేశంలో ప్రతి 778 మందికి ఒక డాక్టర్
MBBS Seats: మన దేశంలో ప్రతి 778 మందికి ఒక డాక్టర్

అక్రిడిటేషన్ పొందడం ఇక అంత సులువు కాదు!

కొత్తగా ఆసుపత్రులు అక్రిడిటేషన్ సాధించేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. సాధారణ డీఎన్‌బీ, పీజీ డిప్లొమా కోర్సుల ఆసుపత్రుల అర్హతల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. సూపర్‌ స్పెషాలిటీ (DrNB), ఫెలోషిప్‌ (FNB) కోర్సులకు గుర్తింపు పొందాలంటే ఆసుపత్రి కనీసం మూడేళ్ల క్రితం ప్రారంభమై ఉండి, వరుసగా రెండేళ్లపాటు క్లినికల్ సేవలందించిన అనుభవం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. వైద్య విద్యలో నాణ్యతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments