HomeEntertainment'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY


‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!

కోలీవుడ్ హీరో సూర్య- టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన “విశ్వనాథ్ అండ్ సన్స్” మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో వెంకీ స్టైల్ మేకింగ్, సూర్య క్లాసీ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ!
నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ!

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మూవీ ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లోని విశేషాలు గమనిస్తే ఈ మూవీలో సూర్య మాజీ ఒలింపిక్ షూటర్ పాత్రలో నటిస్తున్నారు. సూర్య పాత్ర చుట్టూ తిరిగే భావోద్వేగాలు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి.

Surya The Viswanath amp amp Sons trailer is out another hit for Surya Viswanath amp amp Sons movie trailer

అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితర ప్రముఖ తారలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14, 2026 న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే వీరభద్రుడు సినిమాతో సూర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తమిళంలో కరుప్పు అనే టైటిల్ తో రిలీజైన ఈ మూవీ తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీతో సూర్య మాస్ కమ్ బ్యాక్ ఇచ్చారు. సినిమాలోని మాస్ ఎలివేషన్స్ ను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. ఈ మూవీలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో సూర్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాంతో ఈ మూవీ కూడా సూర్య కెరీర్ లో భారీ హిట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య కెరీర్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రానున్నాయి.



Source link

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments