HomeTelanaganahyderabadఅంకిత’ సేవలు అభినందనీయం..!

అంకిత’ సేవలు అభినందనీయం..!

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
  • లేబర్ కార్డులతోనే కార్మికులకు సామాజిక భద్రత
  •  చెంగోల్   గ్రామ  సర్పంచ్ నర్సమ్మ

జనవాహిని ప్రతినిధి తాండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లేబర్ కార్డుల నమోదు ప్రక్రియను ‘అంకిత’ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టడం ఎంతో అభినందనీయమని చెంగోల్ గ్రామ సర్పంచ్ నర్సమ్మ పేర్కొన్నారు.శుక్రవారం మండల పరిధిలోని చెంగోల్ గ్రామంలో ‘అంకిత’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లేబర్ కార్డుల నమోదు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామంలో వివిధ పనుల్లో నిమగ్నమైన కార్మికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్ కార్డులు పొంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపశృతి జరిగి కుటుంబ పోషకుడు మరణిస్తే లేబర్ కార్డు ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక ధీమా లభిస్తుందన్నారు. అలాగే కార్డు కలిగిన కార్మికుల కుటుంబాల్లో ఇద్దరు కుమార్తెల వివాహానికి, ప్రసవ సమయాల్లో రూ. 30,000 చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంత కార్మికులకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్న ‘అంకిత’ స్వచ్ఛంద సంస్థ కృషిని ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, అంకిత సంస్థ ప్రతినిధి నర్సిములు, స్థానిక కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments