HomeTelanaganahyderabadమహిళా రైతులతో విజయక్క...!

మహిళా రైతులతో విజయక్క…!

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
  • పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన కంజర్ల విజయక్క
  •   మహిళా రైతులతో ఆత్మీయ ముచ్చట్లు.. పాడిన జానపద పాటలు
  •  రైతుల సంక్షేమం, మహిళా సాధికారతే లక్ష్యం
  • కంజర్ల విజయలక్ష్మి యాదవ్

జనవాహిని ప్రతినిధి బషీరాబాద్: మండలంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ కార్యక్రమంలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ మహిళా రైతులతో కలిసి సందడి చేశారు. నేరుగా పొలంలోకి దిగి మహిళా రైతులతో కలిసి ఆమె వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా మహిళా రైతుల కష్టసుఖాలను, వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పొలం గట్టుపై రైతులతో కలిసి సరదాగా స్నాక్స్ ఆరగించారు. వారితో కలిసి ఉత్సాహంగా జానపద పాటలు పాడుతూ రోజంతా ఎంతో ఆనందంగా గడిపారు. తమ కష్టాలను మర్చిపోయేలా విజయక్క తమతో కలిసి పాటలు పాడి అలరించడం పట్ల మహిళా రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ… రైతు కుటుంబాల సంక్షేమం, మహిళా సాధికారతే తమ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి మహిళా రైతుకు ఫౌండేషన్ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నావందిగి సర్పంచ్ శ్రీకాంత్, వికారాబాద్ జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, నాయకులు అనిల్ గౌడ్, ప్రకాష్ గౌడ్, అంబ్రేష్ ముదిరాజ్, చైబాస్ ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానిక మహిళా రైతులు పాల్గొన్నారు.

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments