HomeTelanaganahyderabadసల్లంగా చూడు మైసమ్మ తల్లీ...!

సల్లంగా చూడు మైసమ్మ తల్లీ…!

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో కన్నులపండువగా శాఖాంబరి ఉత్సవాలు
  •  ప్రత్యేక పూజలు నిర్వహించిన కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్

జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణంలోని నెహ్రూగంజ్ లో వెలసిన శ్రీ నాగ ఎల్లమ్మ దేవాలయం, మర్రిచెట్టు కూడలి వద్దనున్న శ్రీ రక్త మైసమ్మ ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు అమ్మవార్లను వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో దివ్యంగా అలంకరించారు. అమ్మవార్లు శాఖాంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా 34వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రకృతి ప్రసాదించిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించి పూజించడం సనాతన సాంప్రదాయమని పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆ పరాశక్తిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, వార్డు మున్సిపల్ నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

JANAVAHINI TV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments