― Advertisement ―

రేపే ఇళ్ల పంపిణి…!

అర్హులైన నిరుపేదలకు రేపే ‘డబుల్’ ఇండ్ల పంపిణీ తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు...
HomeNEWSరామన్న వస్తున్నాడు.....!

రామన్న వస్తున్నాడు…..!

spot_img
  • తాండూరులో ‘గులాబీ’ గర్జన..!
  • నేడు కేటీఆర్ భారీ రోడ్ షో
  • ​మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి.. ఇందిరా చౌక్ వద్ద ప్రచార భేరి 

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా తాండూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు నేడు తాండూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10:00 గంటలకు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఇందిరా చౌక్ వద్ద నిర్వహించే భారీ రోడ్ షోలో ఆయన పాల్గొంటారు.మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కేటీఆర్ ఈ పర్యటన చేపట్టారు. తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యేలు మరియు స్థానిక నేతలు ఈ రోడ్ షోను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.​కేటీఆర్ రాకను పురస్కరించుకుని తాండూరు పోలీసులు పట్టణంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందిరా చౌక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు.