― Advertisement ―

ఇళ్ల పంపిణీలో తొందరపాటు వద్దు…!

క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేటాయింపులా? అర్హులైన పేదల పొట్టకొట్టొద్దు: బీఆర్ఎస్ నేత సంతోష్ గౌడ్  కలెక్టర్, ఎమ్మెల్యేలకు డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్...
HomeNEWSఇళ్ల పంపిణీలో తొందరపాటు వద్దు...!

ఇళ్ల పంపిణీలో తొందరపాటు వద్దు…!

spot_img
  • క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేటాయింపులా?
  • అర్హులైన పేదల పొట్టకొట్టొద్దు: బీఆర్ఎస్ నేత సంతోష్ గౌడ్
  •  కలెక్టర్, ఎమ్మెల్యేలకు డిమాండ్

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో అధికార యంత్రాంగం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హుల ఎంపికలో పారదర్శకత లోపించిందని, లబ్ధిదారుల గుర్తింపు సక్రమంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకముందే, హడావుడిగా కేటాయింపులు జరపడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సంతోష్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ స్వయంగా వార్డుల వారీగా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి, అర్హుల జాబితాను సిద్ధం చేసిన తర్వాతే ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, నేటికీ చాలా వార్డుల్లో ఎలాంటి సమగ్ర విచారణ జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే సొంత ఇళ్లు, స్థిరాస్తులు ఉన్న కొందరు వ్యక్తులు కూడా రాజకీయ సిఫార్సులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని సంతోష్ గౌడ్ వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా ఇళ్లను పంచిపెడితే.. దశాబ్దాలుగా గుడిసెల్లో, అద్దె ఇళ్లలో మగ్గుతున్న నిజమైన నిరుపేద కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి వార్డులో ప్రత్యేక అధికారులతో పారదర్శకంగా విచారణ జరిపించి, అర్హులైన పేదలతో కూడిన తుది జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలన్నారు. పనులు వంద శాతం పూర్తయిన తర్వాతే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని, లేనిపక్షంలో నిరుపేద ప్రజలను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సంతోష్ గౌడ్ హెచ్చరించారు.