భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జనవాహిని ప్రతినిధి
అశ్వాపురం :- అశ్వాపురం మండలం లో ఈ రోజు బస్టాండ్ సెంటర్ లో అవగాహనా సదస్సు లో భాగంగా సి.ఐ. యల్లయ్య ఆటో డ్రైవర్లకు భద్రత నియమాలు, క్రైమ్ నియంత్రనల గురించి తగు సలహాలు, చూచనలు ఇవ్వడం జరిగింది.సెంటర్ లో తిరిగే ప్రతీ ఆటో డ్రైవర్ కు లైసెన్స్ తో పాటు ఆటోలకు కాగితాలు తప్పకుండ ఉండాలి అని, అవి లేకుండా ఆటోలు నడపొద్దు అని, అలాగే భద్రత నియమాలు పాటించాలి అని, డ్రింక్ చేసి ఆటోలు నడపొద్దు అని, అలా నడపడం చట్ట విరుద్దమని, నియమాలు పాటించకుండా ఎవరు ఆటో నడిపినా లైసెన్స్ రద్దు చేపిస్తాము అని డ్రైవర్లకు చెప్పడం జరిగింది. అలాగే క్రైమ్ లు జరగకుండా జాగర్త పాటించాలని ప్యాసింజర్లుకు జాగ్రత్తలు చెప్పాలని, తగు చూచనలు ఇవ్వడం జరిగింది, ఇన్సూరెన్స్ కూడా తప్పకుండ ప్రతీ ఒక్కళ్ళు చేపించుకోవాలని డ్రైవర్లకు తెలియజేసారు, మీ భద్రతే మీ కుటుంబాల భద్రత అని తెలియజేసారు, ఈ అవగాహనా సదస్సు లో పోలీస్ సిబ్బంది, మూడు యూనియన్ల డ్రైవర్లు పాల్గొన్నారు.




