- తాండూరు మున్సిపాలిటీ 26వ వార్డులో నూతన బోరు వేయించిన కౌన్సిలర్
- స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులకు కృతజ్ఞతలు
- హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు
జనవాహిని ప్రతినిధి తాండూరు:తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు ప్రజల తాగునీటి కష్టాలకు తెరపడింది. వార్డులో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వార్డులోని శివాజీ చౌక్ దగ్గర గల అప్నా బజార్ కాంప్లెక్స్ ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్న స్థానికుల విజ్ఞప్తి మేరకు, ఆమె మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నూతన బోరు బావిని అర్ధ రాత్రి 3 గంటల వరకు అక్కడే ఉండి తవ్వించారు. వార్డులో నీటి సమస్య ఉందని చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డికి, మున్సిపల్ అధికారులకు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తమ వార్డులో నీటి కొరతను గుర్తించి, తక్షణమే స్పందించి బోరు బావి వేయించిన కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల నాటి సమస్యను చొరవ చూపి పరిష్కరించడం పట్ల వార్డు మహిళలు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌తో పాటు మున్సిపల్ పాలకులకు ధన్యవాదాలు తెలియజేశారు.




