- ధరల పెంపుపై ధర్నా చేస్తే కక్షసాధింపు చర్యలు
- ఆరేళ్లుగా వేధిస్తున్నా వెనకడుగు వేసేది లేదు
- కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజల పక్షాన నిలబడి పోరాడే వారిని అక్రమ కేసులతో భయపెట్టలేరని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. గత 2020లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నాను మనసులో ఉంచుకుని, అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం తమపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిందని వారు మండిపడ్డారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నప్పటికీ, న్యాయంపై నమ్మకంతో చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం వారు స్థానిక కోర్టుకు హాజరై, తమ న్యాయవాదుల ద్వారా వాదనలను వినిపించారు. ప్రజల కోసం నిలబడినందుకే తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళం కాదని, తమకు ప్రజల ఆశీస్సులు, సంపూర్ణ అండదండలు ఉన్నాయని వారు ధీమా వ్యక్తం చేశారు.కోర్టుకు హాజరైన వారిలో కాంగ్రెస్ నాయకులు బాతుల వెంకట్ ప్రభాకర్ గౌడ్, సంతోష్ కావాలి, కాంగ్రెస్ యువజన నాయకులు జోగులా ఎబినైజర్, భీమ్ బాతుల తదితరులు ఉన్నారు.




