― Advertisement ―

రేపే ఇళ్ల పంపిణి…!

అర్హులైన నిరుపేదలకు రేపే ‘డబుల్’ ఇండ్ల పంపిణీ తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు...
HomeNEWSరేపే ఇళ్ల పంపిణి...!

రేపే ఇళ్ల పంపిణి…!

spot_img
  • అర్హులైన నిరుపేదలకు రేపే ‘డబుల్’ ఇండ్ల పంపిణీ
  • తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు
  • కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన నిరుపేదలకు శుక్రవారం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం వైభవంగా జరగనుందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేల ముఖ్య సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈ ఇండ్ల కేటాయింపు ప్రక్రియ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని, అర్హులందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా బాతుల నాగు స్పష్టం చేశారు.