― Advertisement ―

డబ్బులు ఇస్తామని హత్య చేశారు..!

ఫైనాన్స్ వివాదంలో తాండూరు మహిళల దారుణ హత్య  డబ్బులిస్తామని నమ్మించి రప్పించిన దుండగులు  మోయినాబాద్, చేవెళ్ల ఫార్మ్‌హౌస్‌లలో ఘాతుకం  హత్య చేసి మృతదేహాలను పూడ్చిపెట్టిన వైనం మోయినాబాద్/చేవెళ్ల జనవాహిని ప్రతినిధి:    ఆర్థిక...
HomeNEWSడబ్బులు ఇస్తామని హత్య చేశారు..!

డబ్బులు ఇస్తామని హత్య చేశారు..!

spot_img
  • ఫైనాన్స్ వివాదంలో తాండూరు మహిళల దారుణ హత్య
  •  డబ్బులిస్తామని నమ్మించి రప్పించిన దుండగులు
  •  మోయినాబాద్, చేవెళ్ల ఫార్మ్‌హౌస్‌లలో ఘాతుకం
  •  హత్య చేసి మృతదేహాలను పూడ్చిపెట్టిన వైనం

మోయినాబాద్/చేవెళ్ల జనవాహిని ప్రతినిధి:    ఆర్థిక లావాదేవీల వివాదం ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను బలితీసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలను నమ్మించి పిలిపించి, వేర్వేరు ఫార్మ్‌హౌస్‌లలో దారుణంగా హత్య చేసిన ఉదంతం రంగారెడ్డి జిల్లా పరిధిలో తీవ్ర కలకలం రేపింది. నమ్మినవారే నయవంచనకు ఒడిగట్టి, అత్యంత కిరాతకంగా ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. తాండూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలకు (60 ఏళ్ల పైబడినవారు) కొంతకాలంగా కొందరితో ఫైనాన్స్ (డబ్బుల) వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాధితులకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికిన నిందితులు, వారిని తాండూరు నుంచి ఇక్కడికి రప్పించారు.బాధితులు ఇక్కడికి చేరుకున్న తర్వాత నిందితులు వారిని విడివిడిగా తరలించారు. ఒక మహిళను మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఫార్మ్‌హౌస్‌లో, మరో మహిళను చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంకొక ఫార్మ్‌హౌస్‌లో కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాలను ఆయా ఫార్మ్‌హౌస్‌లలోనే గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు.బాధితుల అదృశ్యం, సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులకు దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మోయినాబాద్ పరిధిలోని ఫార్మ్‌హౌస్ నుండి ఇప్పటికే ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల పరిధిలోని ఫార్మ్‌హౌస్‌లో పూడ్చిపెట్టిన మరో వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్లూస్ టీమ్, టెక్నికల్ ఎవిడెన్స్ (సాంకేతిక ఆధారాలు) ఆధారంగా పోలీసులు కేసును వేగవంతం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.