― Advertisement ―

మైనర్ బాలికపై యువకుడి అఘాయిత్యం

చార్జర్, నీళ్ల సాకుతో ఇంట్లోకి వెళ్లి దారుణం నిందితుడిపై రేప్, పోక్సో కేసు నమోదు వివరాలు వెల్లడించిన ఎస్ఐ విట్టల్ రెడ్డి జనవాహిణి ప్రతినిధి తాండూరు : యాలల మండల పరిధిలోని ఓ...
HomeNEWSశౌర్యానికి ప్రతీక శంభాజీ మహారాజ్..!

శౌర్యానికి ప్రతీక శంభాజీ మహారాజ్..!

spot_img
  • ధర్మవీర శంభాజీ మహారాజ్‌కు ఘన నివాళి
  • తాండూరు ఆర్యావీర్ దళ్‌లో జయంతి వేడుకలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : స్వరాజ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ధర్మవీర, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి వేడుకలను తాండూరులోని ఆర్యావీర్ దళ్ కార్యాలయంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి, దీప ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యావీర్ దళ్ ప్రతినిధులు, యువకులు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా హిందూ స్వరాజ్యాన్ని కాపాడటంలో శంభాజీ చూపిన చొరవ అసాధారణమైనదని పేర్కొన్నారు. వందలాది యుద్ధాల్లో పాల్గొని ఒక్కటంటే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని అజేయ యోధుడని కొనియాడారు. హిందూ ధర్మం కోసం అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ఏనాడూ తలవంచని ఆయన ధైర్యం చిరస్మరణీయమని అన్నారు.ప్రస్తుత సమాజంలో యువత పాశ్చాత్య పోకడలకు లోనుకాకుండా, శంభాజీ వంటి వీరుల చరిత్రను చదివి దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, మాతృభూమిని గౌరవించడం ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యావీర్ దళ్ సభ్యులు, పట్టణానికి చెందిన పలువురు యువకులు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.