- ఆడుకుంటున్న చిన్నారిని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి దారుణం
- నిందితుడు నరేష్‌పై కేసు నమోదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండల పరిధిలోని జీవంగి గ్రామంలో అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసేలా ఒ యువకుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.గ్రామానికి చెందిన రమణి నరేష్ (25), తండ్రి నర్సిములు, అదే గ్రామంలో ఉంటున్నాడు. బాధితురాలు తన నానమ్మ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో, నిందితుడు ఆమెపై కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని మభ్యపెట్టి సమీపంలోని ఒక పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డదాని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. నిందితుడు రమణి నరేష్‌పై హత్య మరియు హత్యాచారం చేసాడని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.




