- ఘనంగా మాజీ డీసీసీబీ చైర్మన్ పి. లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన తనయుడు మహిపాల్ రెడ్డి, మేనల్లుడు
- హాజరైన సంగారెడ్డి మిత్రబృందం, కాంగ్రెస్ శ్రేణులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పి. లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తనయుడు, పెద్దముల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. మహిపాల్ రెడ్డి మరియు ఆయన మేనల్లుడు.. సంగారెడ్డికి చెందిన తమ మిత్రబృందంతో పాటు తాండూరు మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు రాజు, భగవాన్, అశోక్ లు కలిసి లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. లక్ష్మారెడ్డి భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని వారు ఆకాంక్షించారు.ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.




