- గణేశుడి ఆకృతిలో టమాటా
- అవాక్కవుతున్న జనం: టమాటాలో దైవ దర్శనం
- తాండూరులో వైరల్ అవుతున్న ‘గణేశ టమాటా’
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనంగా మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్లో విక్రయానికి వచ్చిన ఒక టమాటా, అచ్చం విఘ్నేశ్వరుని ఆకారాన్ని పోలి ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.శుక్రవారం మార్కెట్కు కూరగాయలు కొనేందుకు వెళ్లిన వినియోగదారులకు ఈ వింత దృశ్యం కంటపడింది. ఒకవైపు తొండం, మరోవైపు వినాయకుని ముఖ కవళికలను పోలిన ఆకృతి ఆ టమాటాకు ఉండటంతో, అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్గా మారాయి.సాధారణంగా కూరగాయలు వింత ఆకారాల్లో పెరగడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే, భక్తులు మాత్రం దీనిని దైవ సంకల్పంగా భావిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆకృతి ఇది, మనకు గణపతి దర్శనం అయినంత ఆనందంగా ఉంది అని స్థానికులు వ్యాఖ్యానించారు.





