- ముమ్మరంగా సాగిన కార్యక్రమం
- పాల్గొన్న కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి, బీఎల్ఓ రాములు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని సీతారాంపేట్ 19వ వార్డులో ‘సార్’ నోటీసుల పంపిణీ కార్యక్రమం శనివారం ముమ్మరంగా సాగింది. వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ఆధ్వర్యంలో నాయకులు, అధికారులు ప్రతి ఇంటికీ తిరుగుతూ ఈ నోటీసులను, ఫారాలను ప్రజలకు అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నివాసితులకు అవసరమైన మార్గదర్శకాలను ఈ సందర్భంగా వివరించారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఓ రాములు, బీఎల్ఏ సయ్యద్ ఖాజీ, వార్డ్ ఆర్పీ వెంకటలక్ష్మి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సమద్ మరియు వార్డుకు చెందిన యువకులు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




