- తాండూరులో ఇందిరమ్మ చీరల హడావిడి
- కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్నారు: రాజు గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు గౌడ్ హాజరై, వార్డులోని మహిళలకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాండూరు పట్టణంలోని అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ పథకాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని వార్డు రాజు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్పీ అన్నపూర్ణ, కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద పాల్గొన్నారు. చీరలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




