- 32వ వార్డు అభివృద్ధిపై కౌన్సిలర్ మహేశ్వరి ప్రత్యేక ఫోకస్
- సమస్యను పరిష్కరించినందుకు ప్రజల కృతజ్ఞతలు
- 2 నూతన బోర్లు, పాడైన బోర్లకు ఫ్లెషింగ్, వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయించిన కౌన్సిలర్
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని 32వ వార్డులో దశాబ్ద కాలంగా పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వార్డు కౌన్సిలర్ మహేశ్వరి ప్రత్యేక చొరవతో చేపట్టిన నూతన నీటి సరఫరా వ్యవస్థ పనులు పూర్తి కావడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. శనివారం వార్డులో నీటి సరఫరాను పరిశీలించిన ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వార్డ్ లో నూతనంగా 2 బోర్‌వేల్స్, పాడైన బోర్లకు ఫ్లసింగ్, ఓ కొత్త వాటర్త ట్యాంక్పా ను ఏర్పాటు చేశారు. 32వ వార్డు అభివృద్ధి విషయంలో తీవ్ర వివక్షకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నీటి సమస్యను పరిష్కరించలేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గాలికి వదిలేశారని వారు వాపోయారు. అయితే, ప్రస్తుత కౌన్సిలర్ మహేశ్వరి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వార్డు ముఖచిత్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులో నీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పైపులైన్ పనులు, నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయించారు. సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి, నిధులు మంజూరు చేయించడమే కాకుండా పనుల నాణ్యతను స్వయంగా పర్యవేక్షించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి.మహిళల నీటి కష్టాలను తీర్చిన కౌన్సిలర్ మహేశ్వరి కి వార్డు ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.




