Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSకౌన్సిలర్ గా ప్రమాణస్వీకారం..!

కౌన్సిలర్ గా ప్రమాణస్వీకారం..!

spot_img
  • మున్సిపల్ కౌన్సిలర్‌గా నసీరా బాను ప్రమాణస్వీకారం
  • పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్పర్సన్

జనవాహిని ప్రతినిధి తాండూరు : బిఆర్ఎస్ పార్టీ తరపున 25వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన నసీరా బాను గురువుగారు అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆమె ఈ బాధ్యతలను స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి లు నసీరా బానుకు పుష్పగుచ్ఛాలు అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగాప్రమాణస్వీకారం అనంతరం నసీరా బాను మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన నాయకులకు, వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.