Google search engine
spot_img
HomeTelanaganahyderabadఓపెన్ జిమ్ పార్క్‌కు భూమిపూజ..!

ఓపెన్ జిమ్ పార్క్‌కు భూమిపూజ..!

spot_img
spot_img
  • 12వ వార్డులో రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్
  • భూమిపూజ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి
  • ప్రజారోగ్య పరిరక్షణే మున్సిపాలిటీ ధ్యేయం

జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణాభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో చేపట్టనున్న ఈ పనులకు సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ… పట్టణ ప్రజల ఆరోగ్య భద్రతకు మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. యువతతో పాటు అన్ని వయసుల వారు నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఈ ఓపెన్ జిమ్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్, తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments