HomeEntertainmentఓటీటీలోకి 'రావు బహదూర్'.. కొడుకు పుట్టుకపై తండ్రికి అనుమానం.!

ఓటీటీలోకి 'రావు బహదూర్'.. కొడుకు పుట్టుకపై తండ్రికి అనుమానం.!


ఓటీటీలోకి ‘రావు బహదూర్’.. కొడుకు పుట్టుకపై తండ్రికి అనుమానం.!

Jul 28, 2026 12:59PM

యాక్టర్ సత్యదేవ్, డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్లో తెరకెక్కిన సైకలాజికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘రావు బహదూర్‘. థియేటర్లలో విభిన్నమైన కథాంశంతో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఈ జూలై 3న థియేటర్లలో విడుదలైన ‘రావు బహదూర్’, ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. ఇప్పుడు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిజిటల్ వేదికపై సందడి చేయడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘రావు బహాదుర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: రావు బహదూర్ మూవీ రివ్యూ 

“అనుమానం పెనుభూతం” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ సినిమా, ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. థియేటర్‌లో ఈ వినూత్న ప్రయోగాన్ని మిస్ అయిన ఫిల్మ్ లవర్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యాన్స్, జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘రావు బహదూర్’ చూసి ఎంజాయ్ చేయవచ్చు.

 

కథ ఏంటంటే..
రాజ కుటుంబానికి చెందిన రామప్ప(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ తో బాధపడుతుంటాడు. భ్రమలు, భయాలతో తన గదినే ప్రపంచంగా బ్రతుకుతున్న రామప్పకు వింతైన మానసిక సమస్య కూడా ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న అతను.. మరెన్నో రోజులు బ్రతకడని డాక్టర్లు చెబుతారు. కానీ, సీనియర్ డాక్టర్ల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ.. రామప్ప ఎక్కువరోజులు బతుకుతుంటాడు. దానికి కారణం అనుమానం అనే పెనుభూతం. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన రెండో కొడుకు తనకి పుట్టినవాడు కాదని అనుమాన పడుతుంటాడు. ఆ అనుమానం తీరే వరకు ప్రాణాలతోనే ఉంటానంటూ, చావుకే సవాల్ విసురుతాడు. అసలు రామప్పకు ఆ మానసిక సమస్య ఎలా వచ్చింది? కొడుకు పుట్టుకపై అనుమానం కలగడానికి కారణమేంటి? అసలు ఆ అనుమానం నిజామా కాదా? చివరికి రామప్పకు తెలిసిన నిజమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

 

Rao Bahadur, OTT Release, Netflix, Satyadev, Venkatesh Maha

 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments