HomeEntertainment‘ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?

‘ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?


‘ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?

తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ ఏడాది అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ ఒకటి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిటా అనంతరం వీరిద్దరి కలయికలో రాబోతున్న రెండో ప్రాజెక్టు కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రచార కంటెంట్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఓ స్పెషల్ సాంగ్ ను రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ క్రేజీ బ్యూటీని రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం.

హీరోని పెళ్లి చేసుకోను: శోభిత పాత వీడియో వైరల్
హీరోని పెళ్లి చేసుకోను: శోభిత పాత వీడియో వైరల్

ఈ సినిమాలోని ఆ ప్రత్యేక సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ఖరారయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ హీరోయిన్ మరెవరో కాదు.. ‘దసరా’ సినిమాలో నాని, శ్రీకాంత్ కాంబోలో నటించిన మహానటి కీర్తి సురేష్. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎవరినీ తీసుకుందామా అని చాలా రోజులుగా ఆలోచించి.. చివరగా కీర్తి సురేష్ ను అనుకున్నారని సమాచారం. నాని, కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కీర్తిని స్పెషల్ సాంగ్ కోసం రిక్వెస్ట్ చేశారట. దానికి ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆ సెట్‌లోనే ప్రత్యేక సాంగ్ ను రేపటి నుంచి తెరకెక్కించబోతున్నారట. దాదాపు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో ఈ సాంగ్ ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Actress Keerthy Suresh to Do a Special Item Song in Nani The Paradise Movie Full Details Here

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇద్దరితోనూ కీర్తికి విజయవంతమైన అనుబంధం ఉండటంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ వార్తలు నిజమైతే, తన కెరీర్ మొత్తంలో గ్లామరస్ స్పెషల్ పాటలకు దూరంగా ఉన్న కీర్తికి ఇది ఓ ఆశ్చర్యకరమైన పరిణామం అవుతుంది.’ది ప్యారడైజ్’ వంటి ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్.. విడుదలకు ముందు నిస్సందేహంగా అతిపెద్ద చర్చనీయాంశాలలో ఒకటిగా మారుతుంది. అయితే ఈ వార్తలపై చిత్ర నిర్మాతలు గానీ, నటి గానీ ఇప్పటివరకు స్పందించలేదు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments