HomeTelanaganahyderabadగ్రామం లో చిచ్చు పెట్టిన ఇసుక....!

గ్రామం లో చిచ్చు పెట్టిన ఇసుక….!

  • గ్రామంలో చిచ్చు పెట్టిన ఇసుక పంచాయితీ….
  • తమ పంట పొలం లో అక్రమంగా ఇసుక కజేస్తున్నారని గ్రామానికి చెందిన వ్యక్తి ఆరోపణ
  • ఇసుక టిప్పర్ లను ఆపిన గ్రామస్థులు…

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇసుక పంచాయితీ ఓ గ్రామంలో చిచ్చు పెట్టింది. తమ పంట పొలాల్లో అక్రమంగా ఇసుక తోడేస్తునరాని గ్రామానికి చెందిన కొందరు.. బాధితులు….ఇసుక టిప్పర్ లను నిలిపేశారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం విశ్వనాధ్పూర్ గ్రామం లో ఇసుక రవాణా అక్రమంగా తోడేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన కొందరు ఇసుక టిప్పర్ లను గ్రామ సమీపంలో నిలిపి వేశారు. ఈ సందర్బంగా తమ గ్రామంలో వారికీ చెందిన పంట పొలాల్లో ఎలాంటి సమాచారం లేకుండా… అక్రమంగా ఇసుక ను తిడేస్తున్నారని ఆరోపించారు. పంట పొలాల్లో ఇసుక ను కజేస్తూ….. దౌర్జన్యనికి గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. యాలల మండలం లో గత కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా…. ఇసుక రవాణా జరుగుతుందని.. గ్రామానికి చెందిన కొందరి పంట పొలాల్లో కూడా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారన్నారు. భారీ లోడ్ తో ఇసుక ను తరలిస్తున్న టిప్పర్ ల వల్ల.. శివ సాగర్ ప్రాజెక్ట్ అనకట్ట ఒరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ లను ఆపిన కొందరిని అదే గ్రామానికి చెందిన మరి కొందరు… వారి పొలాల్లో ఇసుక పోతుందని చెప్పడం తో.. రేపటి నుండి ఇసుక రవాణాను నిలిపి వేస్తాం అని హామీ ఇచ్చారు. దింతో ఆ గ్రామంలో ఇసుక ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments