HomeNewsతల్లికి వందనం అందని వారికి మరో ఛాన్స్ - తాజా షెడ్యూల్ ప్రకటన..!

తల్లికి వందనం అందని వారికి మరో ఛాన్స్ – తాజా షెడ్యూల్ ప్రకటన..!

తల్లికి వందనం అందని వారికి మరో ఛాన్స్ – తాజా షెడ్యూల్ ప్రకటన..!

ఏపీలో ఈ ఏడాది పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులకు తల్లికి వందనం పథకం (Talliki Vandanam) కింద నిధుల్ని ప్రభుత్వం (AP govt) తాజాగా విడుదల చేసింది. దాదాపు 60 లక్షలకు పైగా విద్యార్ధులకు 10 వేల కోట్లకు పైగా నిధుల్ని విడుదల చేసింది. అయితే ఇంకా చాలా మంది లబ్దిదారులు పలు చోట్ల తమకు తల్లికి వందనం డబ్బులు పడలేదనే ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఏయే కారణాలతో వారికి తల్లికి వందనం డబ్బులు అందలేదో విచారణ చేయిస్తోంది.

తల్లికి వందనం నిధుల విడుదల..! అప్పటివరకూ పడతాయన్న లోకేష్..!
తల్లికి వందనం నిధుల విడుదల..! అప్పటివరకూ పడతాయన్న లోకేష్..!

అదే సమయంలో తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్దిదారులకు నిధులు జమ కాకపోతే అభ్యంతరాలు చెప్పుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం తల్లికి వందనం పథకంలో అర్హులు, అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అలాగే లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఇలా అందిన ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలించి, అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తారు.

Talliki Vandanam Amount Not Credited AP Govt Gives Another Chance to Raise Objections Check Full Schedule

తల్లికి వందనంలో ట్విస్ట్..! డ్వాక్రా మహిళలకు బ్యాంకుల షాక్?
తల్లికి వందనంలో ట్విస్ట్..! డ్వాక్రా మహిళలకు బ్యాంకుల షాక్?

మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యా ర్థులతో పాటు ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో తాజాగా చేరిన విద్యా ర్థుల జాబి తాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదే రోజు అర్హు లైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆ లోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments