HomeNewsకాక్రోచ్‌ల దెబ్బకు లొంగిన బుల్డోజర్ సర్కార్.. ప్రధాన్ రాజీనామాతో రాజ్‌నాథ్ పాత వీడియో వైరల్!

కాక్రోచ్‌ల దెబ్బకు లొంగిన బుల్డోజర్ సర్కార్.. ప్రధాన్ రాజీనామాతో రాజ్‌నాథ్ పాత వీడియో వైరల్!

కాక్రోచ్‌ల దెబ్బకు లొంగిన బుల్డోజర్ సర్కార్.. ప్రధాన్ రాజీనామాతో రాజ్‌నాథ్ పాత వీడియో వైరల్!

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో ఓ కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈ కీలక రాజకీయ పరిణామం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్‌కు సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వైరలవుతోంది. జూన్ 24, 2015 నాటి ఆ వైరల్ క్లిప్‌లో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “సోదరా.. మంత్రులు రాజీనామా చేయరు. ఇది యూపీఏ ప్రభుత్వం కాదు.. ఎన్డీఏ ప్రభుత్వం” అంటూ వ్యాఖ్యానించారు.

 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక, ఆ 30 నిమిషాల్లో సీన్ ఛేంజ్ - తప్పని పరిస్థితుల్లో..!!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక, ఆ 30 నిమిషాల్లో సీన్ ఛేంజ్ – తప్పని పరిస్థితుల్లో..!!

అయితే నీట్ లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఆ రికార్డు ఇప్పుడు బద్ధలైంది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఒత్తిడి ఏర్పడటంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో మోదీ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి రాజీనామా చేయడంతో ఆ రికార్డు బ్రేక్ అయింది. గతంలో మీటూ ఉద్యమంలో వచ్చిన ఆరోపణల కారణంగా ఎంజే అక్బర్ 2018 అక్టోబర్ 17న విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Dharmendra Pradhan Resigns Over NEET Leak Row Rajnath Singh Old Video Viral Full Details

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జూలై 25) తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీక్, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్ వద్ద తమ నిరసనలను విరమించాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ శుక్రవారం (జూలై 24) తన దీక్షను విరమించారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటి నుంచి, విద్యాశాఖ మంత్రి తన పదవిలో కొనసాగుతారా లేక రాజీనామా చేస్తారా అనే దానిపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా - ఫలించిన కాక్రోచ్ పార్టీ పోరాటం..!!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా – ఫలించిన కాక్రోచ్ పార్టీ పోరాటం..!!

రాజీనామా డిమాండ్‌తో నిరసనల హోరు
నీట్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటి నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయరని అంతకుముందు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈలోగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన 47 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. అయినా విద్యార్థులు తగ్గకపోవడంతో శనివారం మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments